
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్తుంగపిండి రాజలింగు తెలిపారు. ఆదివారం (సెప్టెంబర్ 28) కాంగ్రెస్ లీడర్ బండి సదానందంయాదవ్తో కలిసి బస్టాండ్ఏరియాలోని బతుకమ్మ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు.
సోమవారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో వసతులు కల్పించినట్లు తెలిపారు. అంతకు ముందు దుర్గామాత మండపంలో పూజలు చేశారు. కాంగ్రెస్లీడర్లు రాంరెడ్డి, నాగులు దశరథం, నాగులు దుర్గన్న, సత్తయ్య, కత్తి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.