మోతెక్కనున్న మోదీ స్టేడియం ... ఫైనల్ మ్యాచ్‌కు అదిరిపోయే ఏర్పాట్లు

మోతెక్కనున్న మోదీ స్టేడియం ... ఫైనల్ మ్యాచ్‌కు అదిరిపోయే ఏర్పాట్లు
  • ఫైనల్ మ్యాచ్‌కు అదిరిపోయే ఏర్పాట్లు

అహ్మదాబాద్‌‌: వరల్డ్‌‌ క్రికెట్‌‌ను ఊపేస్తున్న ఇండియా, ఆస్ట్రేలియా టైటిల్‌‌ ఫైట్‌‌, క్లోజింగ్‌‌ సెర్మనీ కోసం ఓ రేంజ్‌‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే ఈ ఫైనల్‌ సందర్భంగా ఐసీసీ నాలుగు దశల్లో వేడుకలకు ప్లాన్ చేసింది. ఆటకు ముందు మ్యూజిక్‌‌ కంపోజర్‌‌ ప్రీతమ్‌‌ లైవ్‌‌ షోలో అలరించనున్నాడు. ఫైనల్‌‌ ప్రారంభానికి 10 నిమిషాల ముందు ఇండియన్ ఎయిర్‌‌ ఫోర్స్‌‌కు చెందిన సూర్య కిరణ్‌‌ ఏరోబాటిక్‌‌ బృందం (9 ఎయిర్‌‌ క్రాఫ్ట్‌‌లు)  చేయనున్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. 

లోకల్‌‌ డాన్స్‌‌ గ్రూప్‌‌లు కూడా స్టేడియం ముందు ఆడి పాడనున్నాయి. తొలి ఇన్నింగ్స్‌‌ ముగిసిన తర్వాత వరల్డ్‌‌ కప్స్‌‌ గెలిచిన ఆయా దేశాల కెప్టెన్లను ప్రత్యేక బ్లేజర్లతో బీసీసీఐ సన్మానించనుంది. రెండో ఇన్నింగ్స్‌‌ డ్రింక్స్‌‌ బ్రేక్‌‌లో కళ్లు మిరుమిట్లు గొలిపే లేజర్‌‌ షో,  మ్యాచ్​ ముగిసిన తర్వాత ఫైర్‌‌ వర్క్స్‌‌ను నిర్వహించనున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్‌‌ మార్లెస్‌‌ హాజరవుతున్నారు. దీంతో 4500 మంది పోలీసులతో  అహ్మదాబాద్‌‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఫ్యాన్స్‌‌ కోసం మెట్రో టైమింగ్‌‌ను మార్చడంతో పాటు ఎక్కువ మొత్తంలో రైళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. బాలీవుడ్‌‌ ప్రముఖులు, క్రికెట్‌‌ లెజెండ్స్‌‌ కూడా ఈ మ్యాచ్‌‌కు హాజరవుతున్నారు. 

ఫ్యాన్స్‌‌ తాకిడి ఎక్కువ కావడంతో అహ్మదాబాద్‌‌లో హోటల్‌‌ రూమ్స్‌‌ రేట్లు విపరీతంగా పెరిగాయి. టాప్‌‌ ఫైవ్‌‌ స్టార్‌‌ హోటల్‌‌లో ఒక్క రాత్రి స్టే కోసం రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నారు. మిడ్‌‌ రేంజ్‌‌ హోటల్స్‌‌ రూమ్‌‌ ధరలు ఏడు రేట్లు పెరిగాయి. ఫ్లయిట్‌‌ టిక్కెట్ల ధరలు రూ. 25 వేలకు పెరిగాయి. 

ఫైనల్​కు అంపైర్లుగా  ఇల్లింగ్‌‌‌‌‌‌‌‌వర్త్, కెటిల్‌‌‌‌‌‌‌‌బరో

ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు రిచర్డ్‌‌‌‌‌‌‌‌ ఇల్లింగ్‌‌‌‌‌‌‌‌వర్త్, రిచర్డ్ కెటిల్‌‌‌‌‌‌‌‌బరో ఆన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికయ్యారు. జోయెల్ విల్సన్ థర్డ్‌‌‌‌‌‌‌‌ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, క్రిస్ గఫానీ ఫోర్త్‌‌‌‌‌‌‌‌ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటారు. ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రిఫరీ బాధ్యతలు నిర్వర్తిస్తాడని ఐసీసీ తెలిపింది. కెటిల్‌‌‌‌‌‌‌‌బరో 2015 ఫైనల్లోనూ ఫీల్డ్ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేశాడు.