- విద్యార్థి నాయకుల అరెస్టు
బషీర్ బాగ్, వెలుగు: పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ చేపట్టిన ‘చలో సెక్రటేరియెట్’ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీగా వస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడారు. గత మూడేండ్లుగా విద్యార్థులకు స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ క్రమంలోనే నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని బీసీ జనసభ అధ్యక్షుడు డి. రాజారాం యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.