లేబర్ కమిషనర్‌ని అంటూ మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్ట్

లేబర్ కమిషనర్‌ని అంటూ మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్ట్

నల్గొండ టౌన్ లో గత కొన్ని రోజులుగా లేబర్ కమిషనర్‌ని అంటూ  డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా అధికారులను, వ్యాపారులను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. అతని టార్చర్ తట్టుకోలేక గతంలోనూ వ్యాపారులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే  ఫోన్ చేసినా ... లేబర్ కమిషనర్ ను మాట్లాడుతున్నానంటూ టోకరా వేసి, అందర్నీ మోసం చేశాడు.

అనుమానం వచ్చిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి నిందితుడిపై చర్యలకు ఉపక్రమించారు. అయితే కడప జిల్లా బీకుడూరు చెందిన వ్యక్తిగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.