
న్యూఢిల్లీ: ట్యాక్సీ డ్రైవర్ పై దోపిడీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 29న ట్యాక్సీ డ్రైవర్ జితేందర్ ఓ ప్రయాణికుడిని గమ్యానికి చేర్చిన తర్వాత ISBT ఆనంద్ విహార్ ప్రాంతంలో కారు ఆపాడు. జితేందర్ కారు దగ్గర భోజనం చేస్తుండగా..ఇంతలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేశారు. జితేందర్ ను బెదిరించి అతని దగ్గరున్న రెండు మొబైల్ ఫోన్లు, రూ.6వేల నగదుతోపాటు కారును ఎత్తుకెళ్లారు. దీంతో జితేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి..హర్‌దీప్ సింగ్, విక్కీ, సన్నీ కుమార్ ను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ జస్మీత్ సింగ్ తెలిపారు. నిందితులను సుల్తాన్ పురి ప్రాంతంలో పట్టుకోగా..వారి దగ్గరున్న కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.