
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-రిక్రూట్‌మెంట్ బోర్డు గురుకుల విద్యా సంస్థల్లో 132 ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు-16, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాలు- 6, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాలు- 72, మైనార్టీ సంక్షేమ గురుకులాలు-38 పోస్టులు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి, డిప్లొమా, టీసీసీ, బీఎఫ్‌ఏ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్: రాతపరీక్ష, డెమాన్‌స్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మే 24 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.