ఈ మధ్య ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) గురించే మాట్లాడుకుంటున్నారు. దీని సాయంతో మనిషి చేయాలేని పని, చేయాల్సిన పనిని చిటికెలో చేసేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఏఐ మరింత అభివృద్ధి చెందింది. ఏఐతో క్రియేటివి జోడించి అందరినీ అబ్బుర పరుస్తున్నారు. అయితే, ఈ మధ్య పాతకాలం ఫొటోలకు ఏఐని జోడించి మాట్లాడినట్లు చేయడం, గ్రూప్ ఫొటోలను సెల్ఫీలు తీసుకున్నట్లు మార్చడం, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను కలర్ లోకి మార్చడం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫ్రీడమ్ ఫైటర్ల ఫొటోలను సెల్ఫీ తీసుకుంటున్నట్లు మార్చాడు. పాపులర్ కెమెరానే లేని ఆ రోజుల్లో సెల్ఫీ తీసుకుంటున్న వాళ్ల ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహాత్యా గాంధీ, డా. అంబేడ్కర్, చెగొవెరా, మదర్ తెరెసా, అబ్రహామ్ లింకన్ లాంటి వాళ్ల ఫొటోలను ఏఐ జెనెరేటర్ తో సెల్ఫీలు తీసుకుంటున్నట్లు క్రియేట్ చేశారు. తర్వాత వాటిని ఆయిల్ పెయింట్ ఫిల్టర్ తో ఫొటోషాప్ చేశాడు. వీళ్లంతా నిజంగా సెల్ఫీ తీసుకున్నారా..! అన్నట్లు ఉన్న ఈ ఫొటోలను జ్యో జాన్ ముల్లూర్ అనే ఇన్ స్టాగ్రామ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ ఫొటోలకు 36వేల లైక్స్ వచ్చాయి.