ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతల స్వీకరించిన అరుణ్ గోయల్

ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతల స్వీకరించిన అరుణ్ గోయల్

ఎలక్షన్ కమిషనర్ గా అరుణ్ గోయల్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో ముగ్గురు కమిషనర్లు ఉంటారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా  రాజీవ్ కుమార్ ఉన్నారు. అనుప్ చంద్ర పాండే ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. సుశీల్ చంద్ర మరో ఈసీగా ఉండగా ఆయన  మే నెలలో రిటైర్ అయ్యారు. దీంతో అరుణ్ గోయల్ ను మరో ఈసీగా  కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది. అరుణ్ గోయల్ ఐఏఎస్ ఆఫిసర్ గా విధులు నిర్వర్తించారు. 

పంజాబ్ క్యాడర్ కు చెందిన అశోక్ గోయల్ ఈ నెల 18న స్వచ్ఛందంగా విరమణ పొందారు. ఇవాళ ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. 2025 ఫిబ్రవ‌రిలో రాజీవ్ కుమార్ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత సీఈసీగా గోయ‌ల్ బాధ్యత‌లు స్వీక‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎల‌క్షన్ క‌మీష‌న‌ర్ లేదా చీఫ్ ఎల‌క్షన్ క‌మీష‌న‌ర్‌గా ఓ వ్యక్తి ఆరేళ్ల పాటు విధులు నిర్వ‌ర్తించ‌వ‌చ్చు లేదా ఆ వ్యక్తి 65 ఏళ్లు నిండేవ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌వ‌చ్చు.