అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం : అరూరి రమేశ్‌‌‌‌

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం : అరూరి రమేశ్‌‌‌‌

కాజీపేట/హసన్‌‌‌‌పర్తి, వెలుగు : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఆ పార్టీ వర్ధన్నపేట క్యాండిడేట్‌‌‌‌ అరూరి రమేశ్‌‌‌‌ చెప్పారు. గ్రేటర్‌‌‌‌ మేయర్ గుండు సుధారాణితో కలిసి బుధవారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం, మడికొండలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను చాలా వరకు పరిష్కరించానని చెప్పారు.

డంప్‌‌‌‌ యార్డ్‌‌‌‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని, బయోమైనింగ్‌‌‌‌ పద్ధతిలో చెత్తను శుద్ధి చేసేందుకు పనులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. డంప్‌‌‌‌ యార్డు కోసం కాంగ్రెస్‌‌‌‌ హయాంలోనే స్థలం కేటాయించి, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ క్యాండిడేట్‌‌‌‌ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని కోరారు.

అలాగే గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ 65వ డివిజన్‌‌‌‌ మాజీ కార్పొరేటర్‌‌‌‌ కాయిత సమ్మిరెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి తన అనుచరులతో కలిసి అరూరి రమేశ్‌‌‌‌ సమక్షంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అరూరి చెప్పారు. కార్యక్రమంలో చింత రాజు, తంగెళ్లపల్లి కోటి, ఏరుకొండ అనిల్, ముంజ శ్రీకాంత్‌‌‌‌, సాయికుమార్, మంజుల, అరుణ, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.