మీ నాయకుడి అవినీతి బయటపెడ్తం

మీ నాయకుడి అవినీతి బయటపెడ్తం

న్యూఢిల్లీ : మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ పై ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌) చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సత్యేంద్ర జైన్ ‘నిందితుడు’ కాదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులో పేర్కొందని, అలాంటప్పుడు జైన్ అవినీతిపరుడు ఎలా అవుతారు..? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా త్వరలోనే బీజేపీకి చెందిన ఓ బడా నేత చిట్టా విప్పుతారని చెప్పారు. అసలు అవినీతి అంటే ఏమిటో..? పెద్ద అవినీతిపరులు ఎలా ఉంటారో దేశానికి చెబుతామన్నారు. 

మంత్రి సత్యేంద్ర జైన్ ని అరెస్టు చేస్తారని పంజాబ్‌ ఎన్నికలకు ముందే తనకు తెలుసని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీ డిప్యూటీ మంత్రి మనీష్‌ సిసోడియాను కూడా ఇరికిస్తారని, జైన్‌ తర్వాత అరెస్టు కాబోయే మంత్రి ఆయనే కావచ్చని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులను ఒక్కొక్కరిగా కాకుండా అందర్నీ ఒకేసారి జైల్లో వేయండి మోడీజీ అంటూ వ్యంగ్యంగా అన్నారు. 

గత నెల మే 30న అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వంలోని మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది. ఆయనపై 2015-16లో కోల్‌కతాకు చెందిన సంస్థతో కలిసి హవాలా లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపణలపై కేసు బుక్ చేసింది.

మరిన్ని వార్తల కోసం..

కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన మాజీ మంత్రులు

83 ఏళ్ల వ‌య‌సులో ఒంటరిగా సముద్ర ప్రయాణం