లాక్ డౌన్ ఇష్టం లేదు..కానీ మరో ఆప్షన్ లేదు

లాక్ డౌన్  ఇష్టం లేదు..కానీ మరో ఆప్షన్ లేదు

పరిస్థితి చేయిదాటితే లాక్ డౌన్ తప్ప మరో ఆప్షన్ లేదన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. లాక్ డౌన్ పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో వయస్సు నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని మరోసారి కోరారు . డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టేందుకు ఢిల్లీ సర్కార్ సిద్దంగా ఉందన్నారు. ఢిల్లీలో 65 శాతం కరోనా రోగులు 35 ఏళ్ల లోపు వారేనని చెప్పారు. కరోనాకు చెక్ పెట్టాలంటే వ్యాక్సినేషన్ కీలకమన్నారు. హాస్పిటల్ కు వెళ్లాలనుకునేవారు యాప్ లో ముందే బెడ్స్ అందుబాటులో ఉన్నాయో లేవో తెలుసుకోవాలన్నారు కేజ్రీవాల్.