ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా

ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్  మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు.  ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో  కేజ్రీవాల్ ను విచారణకు హాజరుల కావాలని  ఆదివారం ఈడీ సమన్లు జారీ చేసింది.  కానీ ఆయన ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని ఆప్ వెల్లడించింది.  కోర్టులో బెయిల్ వచ్చాక  మళ్లీ ఎందుకు నోటీసులు పంపించారు. ఈడీ సమన్లు చట్ట విరుద్దం అని ఓ ప్రకటనలో తెలిపింది.  

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఉపయోగిస్తోందని ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్  ఇప్పటికే విచారణకు సమన్లు ​​ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆయన ఎనిమిది సమన్లను దాటవేసారు, వాటిని చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.