
16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియాను ప్రభుత్వం ఈరోజు (డిసెంబర్ 31) నియమించింది. ఈ సందర్భంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కేంద్రం.. ఆర్థిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ రిత్విక్ రంజనం పాండే కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తారని పేర్కొంది.
కమిషన్ తన ఐదేళ్ల కాలానికి (2026-27 నుంచి 2030-31 వరకు) తన నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నవంబర్ నెలలో 16వ ఆర్థిక సంఘం నిబంధనలకు (ToR) ఆమోదం తెలిపింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయ పెంపు చర్యలను సూచించడంతోపాటు, విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం ఏర్పాటు చేసిన నిధులకు సంబంధించి విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రస్తుత ఏర్పాట్లను కమిషన్ సమీక్షిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగ సంస్థ.
Dr Arvind Panagariya, former Vice Chairman, NITI Aayog appointed as Chairman, Finance Commission pic.twitter.com/CuI5MtaMPk
— ANI (@ANI) December 31, 2023