వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌‌గా ఎలన్ మస్క్

వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌‌గా ఎలన్ మస్క్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌గా నిలిచాడు. స్పేస్ ఎక్స్ కంపెనీకి కూడా సీఈవో అయిన మస్క్.. సంపాదనలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌‌ను వెనక్కి నెట్టాడు. మస్క్ 194.8 బిలియన్‌‌ల ఆదాయంతో ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. బెజోస్ 185 బిలియన్‌‌ల ధనార్జనతో రెండో ప్లేస్‌‌లో నిలిచాడు. టెస్లాలో మేజర్ షేర్స్ కలిగిన మస్క్.. ఆ కంపెనీ షేర్ ధర 4.8 శాతం పెరగడంతో బ్లూమ్‌‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌‌లో టాప్ ప్లేస్‌‌కు చేరుకున్నాడు.