ఇవాళ (జూన్23) 1500 మంది అభ్యర్థులకు నీట్ ఎగ్జామ్ 

ఇవాళ (జూన్23) 1500 మంది అభ్యర్థులకు నీట్ ఎగ్జామ్ 

పేపర్ లీక్ అవకతవకల మధ్య మరోసారి నీట్ ఎగ్జామ్ ఈ రోజు (జూన్ 23) జరుగనుంది. గ్రేస్ మార్కులు కలపబడిన  1,563 మంది అభ్యర్థులకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ యూజీ రీటెస్ట్ ను తిరిగి ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ , ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అధికారులు కూడా పరీక్షా కేంద్రాలవద్ద ఉంటారని అధికారులు చెబుతున్నారు. 

NEET -UG2024 పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థుల స్కోర్ కార్డులు రద్దు చేయబడతాయని , ఈ అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రింకోర్టు ను తెలిపిన ప్రకారం ఎగ్జామ్ జూన్ 23న నిర్వహిస్తున్నారు. ఫలితా జూన్ 30 లోపు ప్రకటిస్తారు. 

కాగా NEET -UG2024 పరీక్ష మే5 నిర్వహించారు. ఫలితాలు జూన్ 14న విడుదల చేయాల్సి ఉండగా. షెడ్యూల్ కంటే ముందే జూన్ 4న ప్రకటించారు. 67 మంది విద్యా ర్థులు టాప్ లో ఉన్నారని ప్రకటించడంతో అక్రమాలు, పేపర్ లీక్ లు జరిగినట్లు ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు , ఆందోళన జరిగాయి.ఈ కేసు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది.

ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలతో కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను తొలగించింది. పరీక్షల్లో సంస్క రణ లు చేయడానికి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.