మంకీపాక్స్ కట్టడికి చర్యలు తీసుకోండి

మంకీపాక్స్ కట్టడికి చర్యలు తీసుకోండి

జెనీవా: మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) కీలక సూచన చేసింది. ఈ వ్యాధి ముప్పును తప్పించుకునేందుకు తమ సెక్సువల్ పార్టనర్లను తగ్గించుకోవాలని గేలు, బై సెక్సువల్స్ కు డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం సూచించారు. కొత్త వారితో సెక్స్ చేయొద్దన్నారు. ఇప్పటి వరకు మగవారితో, ఆడ–మగ ఇద్దరితోనూ సెక్స్ చేసిన వారిలోనే ఎక్కువ మందికి మంకీపాక్స్ సోకిందని చెప్పారు.

మంకీపాక్స్ బాధితుల్లో 98 శాతం మంది గే/బై సెక్సువల్స్ అని, 95 శాతం మందికి సెక్స్ ద్వారానే వైరస్ వ్యాపించిందని స్టడీలో తేలిందని తెలిపారు. ఇప్పటి వరకు 78 దేశాల్లో 18 వేల మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వాటిలో 70 శాతం యూరప్ లో, 25 శాతం అమెరికాలో ఉన్నాయని పేర్కొన్నారు. మంకీపాక్స్ ఎవరికైనా సోకుతుందని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంకీపాక్స్ పై మాస్ వ్యాక్సికేషన్ కు ఇప్పుడే రికమండ్ చేయలేమన్నారు.