దేశంలో 88 శాతం మందికి వ్యాక్సిన్ వేశాం

దేశంలో 88 శాతం మందికి వ్యాక్సిన్ వేశాం

దేశంలో ఇప్పటి వరకు 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. రోజు వారీగా పరిస్థితిపై నిపుణులతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం రాజ్యసభలో మాట్లాడారు. కరోనా ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లలో నేర్చుకున్న అనుభవాలతో కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎటువంటి సమస్యలు రాకుండా అత్యవసరమైన మందులను భారీగా స్టాక్ ఉంచామని మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో ఇప్పటి వరకూ కరోనా వ్యాక్సిన్ అర్హత ఉన్న వారిలో 88 శాతం ప్రజలకు ఫస్డ్ డోస్‌ను హెల్త్ వర్కర్లు వేశారని అన్నారు. అలాగే 58 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. ఇప్పటికే దేశంలో మెజారిటీ జనాభాకు వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద సరిపడా వ్యాక్సిన్‌ స్టాక్ ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. ప్రస్తుతం 17 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని, పైగా మన దేశ వ్యాక్సిన్ తయారీ కెపాసిటీ భారీగా పెరిగిందని అన్నారు. నెలకు 31 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం మన సొంతమని, మరో 60 రోజుల్లోపే నెలవారీ కెపాసిటీ 45 కోట్లకు పెరగనుందని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

ఓటర్, ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్‌ సభ ఆమోదం

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి

బూస్టర్ డోసుకు అనుమతివ్వండి