కురుమూర్తి అలంకారోత్సవం

కురుమూర్తి అలంకారోత్సవం

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా కురుమూర్తి జాతరలో భాగంగా ఆదివారం స్వామివారి అలంకారోత్సవం ఘనంగా నిర్వహించారు.  వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు లాకర్‌‌లో గత ఏడాది భద్రపరిచిన స్వామివారి బంగారు ఆభరణాలను దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో  బయటికి తీసి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంపుల్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు.  ఆభరణాలు, అమరచింత పట్టణానికి చెందిన పద్మశాలీ వంశస్తులు నేసిన పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించారు.

సోమవారం  ఉద్దాల ఉత్సవం జరగనుంది. మహబూబ్ నగర్ జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డితో పాటు ఆలయ ధర్మకర్తలైన ముక్కెర వంశస్థులు, ఆత్మకూరు సంస్థానాధీశుల వారసులు రాజా శ్రీరామ్ సోం భూపాల్ ఉత్సవాల్లో పాల్గొన్నారు.