రాజాసింగ్ వాయిస్ శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్కు పంపాలె

రాజాసింగ్ వాయిస్ శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్కు పంపాలె

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీస్ కస్టడీకి పంపాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆయన వాయిస్ శాంపిల్స్ను ఎఫ్ఎస్ఎల్కు పంపాలని కోరారు. తద్వారా రాజాసింగ్పై పెట్టిన కేసుకు మరింత బలం వస్తుందని అన్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే చివరిసారి కావాలని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. 

రాజా సింగ్ను విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని అసదుద్దీన్ తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వివాదాస్పద వీడియో రిలీజ్ చేసిన రాజా సింగ్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని.. ఆయనను మరోసారి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.