- బెల్లంపల్లిలో ఆశా వర్కర్ల రిలే దీక్షలు
బెల్లంపల్లి, వెలుగు: ఆశా వర్కర్లను అసభ్య పదజాలంతో దూషించిన హెల్త్ సూపర్ వైజర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం రిలే నిరహార దీక్షలు చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి మాట్లాడారు. పట్టణంలోని షంషీర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న మధు ఈ నెల 8న ఆరోగ్య కేంద్రంలోని ఆశా కార్యకర్తలు సమ్మక్క, స్వరూపను అసభ్య పదజాలంతో
దూషించాడని ఆరోపించారు.
ఆశావర్కర్లను అకారణంగా తిట్టిన సూపర్వైజర్పై కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లు రేణుక, స్వర్ణలత, అమల, శ్యామల, పద్మ, స్రవంతి, మాధవి, డివిజన్ పరిధిలోని వివిధ మండలాల వారు పాల్గొన్నారు.