కొత్తగూడెంలో బోనాల సందడి

కొత్తగూడెంలో బోనాల సందడి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలో ఆషాఢం బోనాలను ఆదివారం భక్తులు వైభవంగా నిర్వహించారు. సిటీలోని బూడిదగడ్డ ఏరియా, చుంచుపల్లి మండలంలోని రాంనగర్​ ఏరియాలతో పాటు పలు ప్రాంతాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి మాత టెంపుల్‌‌‌‌లో హోమం, ప్రత్యేక పూజల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. భక్తులు ఇంటి వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకొని ఆలయాల వద్దకు చేరుకొని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

సత్తెమ్మతల్లికి బోనాలు సమర్పణ

అన్నపురెడ్డిపల్లి: ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలం జానకీపురం గ్రామంలో మహిళలు బోనాలెత్తారు. డప్పు వాయిద్యాయిలతో ప్రదర్శనగా వెళ్లి గ్రామ శివారులోని సత్తెమ్మతల్లికి బోనాలను సమర్పించారు. 

​ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం ఆషాఢమాస బోనాలు ఘనంగా నిర్వహించారు. విజయపురికాలనీ, ముత్యాలంపాడు గ్రామాలకు చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో నీళ్ల బిందెలు, బోనాలతో డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాల మధ్య ఊరేగింపుగా గ్రామ వీధుల గుండా వెళ్లారు. అనంతరం ముత్యాలమ్మ తల్లికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.