
కాన్పూర్: ఆపరేషన్సిందూర్.. పహల్గాం దాడిలో మరణించిన వారికి నిజమైన నివాళి శుభం ద్వివేది భార్య అశాన్య అన్నారు. తన భర్త ఎక్కడ ఉన్నా ఈ రోజు ప్రశాంతంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది కూడా మరణించారు. ఈ మేరకు బుధవారం ద్వివేది భార్య అశాన్య మీడియాతో మాట్లాడారు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీకి, సాయుధ దళాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోదీపై, మన సాయుధ దళాలపై నాకు, నా కుటుంబానికి తగినంత నమ్మకం ఉంది. ఈ దాడులు మా నమ్మకాన్ని సజీవంగా ఉంచాయి. ఉగ్రవాదులు భవిష్యత్తులో అమాయకులపై ఇటువంటి దాడులు చేయకుండా కాపాడతాయి. ప్రధాని మోదీ మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు” అని ఆమె అన్నారు.