
‘రౌడీ బాయ్స్’తో ఆకట్టుకున్న యువ హీరో ఆశిష్ రెడ్డి.. త్వరలో ‘సెల్ఫిష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కాశీ విశాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌ను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో ఆశిష్ ట్రెండీ లుక్‌లో కనిపించగా, ఇవానా ఓ స్టిల్‌లో ట్రెడిషినల్‌గా, మరో స్టిల్‌లో గ్లాసెస్‌తో కూల్‌గా కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘దిల్ ఖుష్’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.