బేబి హీరోయిన్ కు బంపరాఫర్

బేబి హీరోయిన్ కు బంపరాఫర్

బేబి’ చిత్రంతో హీరోయిన్‌‌గా పరిచయమైన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్‌‌ను అందుకుంది. ఆ చిత్ర హీరో ఆనంద్‌‌ దేవరకొండతోనే మరో సినిమాలో ఆమె నటిస్తోంది. ఇదికాక తాజాగా మరో సినిమాలో ఆమె అవకాశాన్ని అందుకుంది. ఆశిష్‌‌ హీరోగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘బలగం’ లాంటి సెన్సేషనల్‌‌ హిట్‌‌ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

ఇందులో హీరోయిన్‌‌గా వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారు. గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా నేషనల్ అవార్డ్ విన్నర్ పి.సి.శ్రీరామ్  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.