వైజాగ్‌‌లో కీలక షెడ్యూల్

వైజాగ్‌‌లో కీలక షెడ్యూల్

‘హీరో’ చిత్రంతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా.. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రెండో సినిమా చేస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించిన ఈ చిత్రాన్ని  సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తికాగా, మూడో షెడ్యూల్‌‌ విశాఖపట్నంలో ప్రారంభమైంది.  ఇది లెంగ్తీ  షెడ్యూల్ అని,  సాంగ్, ఫైట్, టాకీ పార్ట్‌‌ని షూట్ చేయనున్నట్టు తెలిపారు దర్శక నిర్మాతలు.  ఈ కీలక షెడ్యూల్‌‌లో టీమ్ అంతా పాల్గొంటున్నారు.  ఇటీవల అశోక్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో  మీసాలు మెలితిప్పుతూ మాస్‌‌ లుక్‌‌లో కనిపించనున్నాడు అశోక్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు.