గోవా గవర్నర్‌‌‌‌‌‌‌‌గా అశోక గజపతి రాజు ప్రమాణ స్వీకారం

గోవా గవర్నర్‌‌‌‌‌‌‌‌గా అశోక గజపతి రాజు ప్రమాణ స్వీకారం

పణజి: కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజు గోవా గవర్నర్‌‌‌‌‌‌‌‌గా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లోని బాంబే హైకోర్టు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే.. గజపతి రాజుతో గవర్నర్‌‌‌‌‌‌‌‌గా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా అశోక గజపతి రాజు మాట్లాడుతూ.. ‘‘మనమందరం ఒక టీమ్‌‌‌‌గా పనిచేద్దాం. గోవా ప్రజలతో అనుబంధం కలిగి ఉండటం నాకు సంతోషంగా ఉంది. 

నాకు స్థానిక భాష అర్థం కాదు. ఈ గవర్నరేషనల్‌‌‌‌ కార్యాలయంలో ఇది నా మొదటి నియామకం. అయినప్పటికీ నాకు రాజకీయంగా చాలా అనుభవం ఉంది. మినిస్టర్‌‌‌‌‌‌‌‌గా ప్రభుత్వంలో పనిచేశాను.. ప్రతిపక్షంలో కూడా కూర్చున్నాను. ఉమ్మడి ఏపీలో ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను”అని ఆయన అన్నారు.