దేశ భక్తిని చాటుకున్న కామారెడ్డి వాసులు .. అశోక్​నగర్‌‌లో సిందూర్ వీధిగా నామకణం

దేశ భక్తిని చాటుకున్న కామారెడ్డి వాసులు .. అశోక్​నగర్‌‌లో సిందూర్ వీధిగా నామకణం

కామారెడ్డి, వెలుగు : జమ్ము కశ్మీర్​లోని పహెల్గాం ఉగ్ర దాడికి ప్రతికారంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేయడం యావత్ దేశం మద్దతు తెలిపింది. దేశ భక్తిని చాటుకునేలా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్​నగర్​లో సిందూర్ వీధిగా నామకణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

 బోర్డు ఏర్పాటు చేసి పూజలు చేసిన వారిలో వెంకటేశం, తిరుపతిగౌడ్, రాంరెడ్డి,  ఆనంద్ రెడ్డి,  విష్ణువర్ధన్​రెడ్డి,  తిరుపతిగౌడ్​, వెంకటేశం,  లింబాద్రి,  రామ్​చందర్​గౌడ్​, కృష్ణంరాజు,  అంజయ్య, నారాయన్​రావు తదితరులు ఉన్నారు.