Crickek World Cup 2023: 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఇండియన్ స్టార్

Crickek World Cup 2023: 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఇండియన్ స్టార్

ఓ వైపు వరల్డ్ కప్ జరుగుతుంటే మరోవైపు మన డొమెస్టిక్ ప్లేయర్స్ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న మ్యాచుల్లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేస్తున్నారు. ఆంధ్రాపై పంజాబ్ బ్యాటర్లు విరుచుకుపడి ఏకంగా 20 ఓవర్లలో 275 పరుగులు చేస్తే.. మధ్య ప్రదేశ్ ఆటగాడు అశుతోష్ శర్మ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు.

ఈ ఇన్నింగ్స్ తో అశుతోష్ శర్మ టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ టీ 20 ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని బ్రేక్ చేసాడు.15 ఓవర్లలో జట్టు స్కోరు 131-4 వద్ద ఉన్నప్పుడు అశుతోష్ ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు. ఆ తర్వాత ఐదు ఓవర్లు ఈ యాంగ్ ప్లేయర్ చెలరేగిన తీరు సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్యపరించింది. ఆడిన 12 బంతుల్లో ఒక ఫోరు, 8 సిక్సులు ఉండడం విశేషం. 

Also Read :- హైదరాబాద్ క్రికెట్ ఎన్నికలు..పోటీ పడే అభ్యర్థులు వీరే

అశుతోష్ 11 బంతుల్లో చేసిన ఫిఫ్టీ.. ఓవరాల్ గా రెండవ వేగవంతమైన T20 అర్ధశతకం. ఆసియా క్రీడల్లో భాగంగా  దీపేంద్ర సింగ్ 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఈ జాబితాలో ముందున్నాడు. అశుతోష్ తో పాటు వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ అజేయ సెంచరీ చేయడంతో రైల్వేస్ 20 ఓవర్లలో 246-5 పరుగుల భారీ స్కోరు సాధించింది.