
అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట మండలంలో ఇందిరమ్మ చెరువు బాట కార్యక్రమంలో భాగంగా నారం వారి గూడెం నరసింహసాగర్ అలుగు, మద్ది కొండ కోడిసేలవాగు చెరువు అలుగు, మొద్దులమాడ చెరువు పంట కాలవతోపాటు పలు రిపేరు పనులను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం ప్రారంభించారు. తొలకరి వర్షాలు పడే సమయానికి మండలంలో ఉన్న పనులు మొత్తం పూర్తి చేసుకొని రైతులకు నీరు అందించేడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు జూపల్లి రమేశ్, సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, తుమ్మా రాంబాబు, ప్రమోద్, సుంకవల్లి వీరభద్రరావు, మిండా హరిబాబు, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.