అశ్విన్ బాబు శివం భజే .. ఆగస్టు 1న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌ రిలీజ్

అశ్విన్ బాబు  శివం భజే .. ఆగస్టు 1న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌  రిలీజ్

అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌‌‌‌లుక్‌‌‌‌, టీజర్‌‌‌‌‌‌‌‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు అశ్విన్. శుక్రవారం సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటించారు.

ఆగస్టు 1న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.