
తెలుగు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ, టీవీ యాంకర్ ఓంకార్ (Omkar).ప్రముఖ టెలివిజన్ షోలను నిర్మించి, హోస్ట్ చేయడంలో సక్సెస్ ఫుల్ అయ్యారు. రీసెంట్ గా ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు(Ashwinbabu) హీరోగా హిడింబా అనే మూవీతో వచ్చిన విషయం తెలిసేందే.
లేటెస్ట్గా అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1లో ఓ సినిమా చేస్తున్నాడు. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆధ్యాత్మికమైన టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘శివం భజే’(Shivam Bhaje) అనేది సినిమా పేరుగా అనౌన్స్ చేశారు.
ఈ పోస్టర్‌లో శివుని గంభీరమైన,తేజస్సయిన రూపం స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. హీరో ఎత్తైన పర్వతాల నేపథ్యంలో శివుని యొక్క భారీ రూపం ముందు నిలబడి తన్మయత్వంతో చూస్తూ నిలబడ్డాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ కి ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది.
గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1 లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సోదరుడు అర్పాజ్ ఖాన్ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు అర్పాజ్ ఖాన్. ఆ తర్వాత 2017లో రాజ్ తరుణ్ నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో విలన్ గా నటించాడు.
ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ బిగ్ బ్రదర్ చిత్రంలో కూడా నటించారు. తర్వాత మళ్లీ ఇపుడు టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుంది.
శివం భజే కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్స్ తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ విలన్ సాయి ధీనా, హైపర్ ఆది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.
Get ready to witness the power you know, the play you don't ?
— Ganga Entertainments (@GangaEnts) March 11, 2024
Proudly presenting the Title of @GangaEnts #ProductionNo1 - #ShivamBhaje ?@imashwinbabu @arbaazSkhan @DiganganaS @apsardirector @MaheswaraMooli @vikasbadisa @Dsivendra @ChotaKPrasad @sahisuresh #AnithMadadi pic.twitter.com/oKeqsEh1hp