మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

ప్రధాని మోడీ 72వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2 వరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. బ్లడ్ డొనేషన్, ఫ్రీ హెల్త్ చెకప్స్, రోడ్ల క్లీనింగ్, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ, ఒక ఏడాది పాటు టీబీ పేషెంట్ల బాగోగులను చూసుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిసరాలు ఊడ్చి క్లీన్ చేశారు.

మరోవైపు దేశవ్యాప్తంగా 'రక్తదాన్ అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ‌ రక్త దానం చేశారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేపట్టిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. కాగా, మోడీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా కేంద్రమంత్రులు, సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.