జీడిమెట్ల, వెలుగు: పరేడ్ కోసం వచ్చిన ఓ ఏఎస్సై వాకింగ్ చేస్తుండగా.. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో చనిపోయారు. పేట్ బషీరాబాద్‌లో ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ జయరాం నగర్‌తండాకు చెందిన ఆర్. దేవ్‌సింగ్(60) పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. నగరంలోని అల్వాల్‌లో ఉంటూ డ్యూటీ చేస్తున్నారు. శనివారం ఉదయం పీఎస్ఆర్ గార్డెన్లో జరిగే పరేడ్‌కు పోలీసులతో పాటు వచ్చారు.
పరేడ్ తర్వాత గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నారు. అప్పుడే గార్డెన్‌లోకి వచ్చిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్.. దేవ్సింగ్పక్క నుంచి టర్న్ తీసుకుంటున్నాడు. గమనించిన ఏఎస్సై పక్కకు తప్పుకున్నప్పటికీ ట్యాంకర్ వెనుకభాగం తగలడంతో దేవ్ సింగ్ కిందపడి గాయపడ్డారు. గమనించిన తోటి పోలీసులు.. ఆయనను దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. దేవ్‌సింగ్‌కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పేట్బషీరాబాద్పోలీసులు కేసు నమోదు చేశారు.
