చెక్ పోస్ట్​లో ఏఎస్ఐ మందు పార్టీ.. వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టిన స్థానికులు

చెక్ పోస్ట్​లో ఏఎస్ఐ మందు పార్టీ.. వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టిన స్థానికులు
  • విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న బూర్గంపహాడ్​ సీఐ 

బూర్గంపహాడ్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులో డ్యూటీ చేస్తున్న ఓ ఏఎస్ఐ మందు పార్టీ చేసుకుంటుండగా కొందరు వీడియో తీసి సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్​ శివారులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో సోమవారం రాత్రి బూర్గంపహాడ్ ఏఎస్ఐ సత్యం..ఇసుక, మట్టి మాఫియాకు సంబంధించిన వ్యక్తులతో కలిసి చెక్ పోస్ట్ లో మందు పార్టీ చేసుకుంటున్నాడు. 

ఇది చూసిన స్థానికులు మద్యం తాగుతున్న ఏఎస్ఐ సత్యంను వీడియో తీయబోగా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో మంగళవారం మండలంలో సోషల్ మీడియాలో వైరల్​అయ్యింది.  ఈ విషయమై పాల్వంచ సీఐ వినయ్ కుమార్ ను వివరణ కోరగా ఘటన గురించి తెలిసిందని, విచారణ జరిపి బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.