నరాలు తెగే ఉత్కంఠ..పటేల్ వికెట్తో పాటు మ్యాచ్ను ఇచ్చేశాడు

నరాలు తెగే ఉత్కంఠ..పటేల్ వికెట్తో పాటు మ్యాచ్ను ఇచ్చేశాడు

ఆసియాకప్ 2023లో టీమిండియా తొలి ఓటమి మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో 6 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 266 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది.  శభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించాడు. 

266 పరుగుల టార్గెట్ ఛేజింగ్ లో టీమిండియాకి సరైన శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన  రోహిత్ శర్మ, కొత్త తంజీమ్‌ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తెలుగుకుర్రాడు తిలక్ వర్మ  9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన తిలక్ వర్మ, తంజీమ్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 17 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది.  ఈ దశలో గిల్, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి 57 పరుగులు జోడించారు. 39 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మహెదీ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 15 బంతుల్లో 5 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో LBWగా అవుట్ అయ్యాడు.  ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ (26) జడేజా (7) వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సెంచరీ హీరో గిల్ కూడా పెవీలియన్ చేరాడు. దీంతో భారత్ కేవలం 209 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. 

ఈ స్థితిలో అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ఆచితూచి ఆడారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. అయితే 49 ఓవర్లలో భారత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముస్తఫిజుర్ వరుసగా రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ వికెట్లను ఖాతాలో వేసుకుని బంగ్లాను విజయం వైపు తీసుకెళ్లాడు. చివర్లో మహ్మద్ షమీ ఫోర్ కొట్టి ఊపుమీదు కనిపించినా..రెండో పరుగు కోసం ప్రయత్నిం రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 259 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.   ముస్తఫిజుర్ 3 వికెట్లు పడగొట్టాడు. తంజిమ్  హసన్ షకిబ్, మెహెదీ హసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.  షకిబుల్ హసన్, మెహెదై హసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.  

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో  50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. తొలి ఆరు ఓవర్ల లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ డకౌట్‌గా వెనుదిరిగగా.. హసన్‌(13), అనముల్‌ హక్ (4) పరుగులకే పెవిలియన్ చేరారు. అలాంటి కాస్త సమయంలో బంగ్లాదేశ్‌ను షకీబ్ అల్ హసన్ (80), తౌహిద్ (54) ఆదుకున్నారు. చివర్లో నసుమ్ అహ్మద్ (44; 45 బంతుల్లో6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించడంతో బంగ్లా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, మహ్మద్‌ షమి 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు.