మంచి రోజులు రాబోతున్నాయ్: పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన బీసీసీఐ పెద్దలు

మంచి రోజులు రాబోతున్నాయ్: పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన బీసీసీఐ పెద్దలు

2008 ముంబై ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ క్రికెట్ తో స్నేహపూర్వక సంబంధాలు తెంచుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే పాకిస్థాన్ కి ఊరట కలిగిస్తూ  బీసీసీఐ నుంచి ఇద్దరు ప్రముఖులు, పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. ఇదివరకే ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షాకి ఆహ్వానంఅందిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా కి వీసా క్లియరెన్స్ ఆలస్యం అయినా నేడు( సెప్టెంబర్ 4) పాకిస్థాన్ చేరుకున్నారు.

 ముఖ్య అతిధులుగా రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా 

ఆసియా కప్ లో భాగంగా ప్రస్తుతం భారత్, నేపాల్ మధ్య లీగ్ మ్యాచు జరుగుతూ ఉంది. రేపు, ఎల్లుండి అనగా  సెప్టెంబర్ 5న ఆఫ్ఘనిస్తాన్- శ్రీలంక మధ్య గ్రూప్ బీ మ్యాచ్, సెప్టెంబర్ 6న పాకిస్తాన్, గ్రూప్ బీ2 టీమ్‌ మధ్య జరిగే సూపర్ 4 మ్యాచ్ కి వీరిద్దరూ ప్రత్యేక అతిధులుగా వ్యవహరించబోతున్నట్లుగా సమాచారం. ఈ సందర్భంగా  బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ " పాకిస్తాన్‌లో రెండు రోజుల పర్యటన పూర్తిగా క్రికెట్ సంబంధితమైనదే. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. బీసీసీఐ తరుపున లాహోర్‌లో ఓ డిన్నర్ ఏర్పాటు చేస్తాం. ఇందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు, బోర్డు సభ్యులు పాల్గొంటారు.." అని తెలిపాడు. అదేవిధంగా తమ పాత రోజులను గుర్తు చేసుకుంటూ లాహోర్‌లో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నాడు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ..?

దాదాపు దశాబ్దాల కాలంగా వీరిద్దరూ పాకిస్థాన్ లో అడుగుపట్టడంతో ఈ మీటింగ్ లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ చర్చ జరిగే అవకాశం ఉంది  షెడ్యూల్ ప్రకారం 2025 పాకిస్థాన్ ఆతిధ్యమివ్వాల్సి ఉంది. అయితే పాక్ లో మ్యాచులు ఆడలేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వనట్లుగానే కనిపిస్తుంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.