Asia Cup 2023: అందనంత ఎత్తులో భారత్.. దరిదాపుల్లో కనిపించని పాకిస్తాన్

Asia Cup 2023: అందనంత ఎత్తులో  భారత్.. దరిదాపుల్లో కనిపించని పాకిస్తాన్

ఆసియా క‌ప్ ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ చిత్తుచిత్తుగా ఓడింది. మొదట 15.2 ఓవర్లలో 50 పరుగులు చేసిన లంక.. అనంతరం 37 బంతుల్లోనే మ్యాచ్ అప్పగించింది.  ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్.. సగర్వంగా 8వ ఆసియా కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. 

1984 నుండి ఇప్పటివరకు ఆసియా కప్ టోర్నీ 16 సార్లు జరగగా భారత్.. అత్యధికంగా ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది. ఆరు టైటిళ్లతో శ్రీలంక రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండు టైటిళ్లతో మూడో స్థానంలో ఉంది. కాగా, భారత జట్టు చివరి సారిగా 2016లో ఆసియా కప్ గెలిచింది.

ఆసియా కప్ విజేతలు

  • 1984: భారత్ (శ్రీలంకపై)
  • 1986: శ్రీలంక (పాకిస్తాన్‌పై)
  • 1988: భారత్ (శ్రీలంకపై)
  • 1991: భారత్ (శ్రీలంకపై)
  • 1995: భారత్ (శ్రీలంకపై)
  • 1997: శ్రీలంక (భారత్‌పై)
  • 2000: పాకిస్తాన్ (శ్రీలంకపై)
  • 2004:  శ్రీలంక (భారత్‌పై)
  • 2008:  శ్రీలంక (భారత్‌పై)
  • 2010: భారత్ (శ్రీలంకపై)
  • 2012: పాకిస్తాన్ (బంగ్లాదేశ్‌పై)
  • 2014: శ్రీలంక (పాకిస్తాన్‌పై)
  • 2016: భారత్ (బంగ్లాదేశ్‌పై)
  • 2018: (బంగ్లాదేశ్‌పై)
  • 2022: శ్రీలంక (పాకిస్తాన్‌పై)
  • 2023: భారత్ (శ్రీలంకపై)        

ఎప్పుడెప్పుడంటే..?

  • భారత్(8): 1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018, 2023
  • శ్రీలంక(6): 1986, 1997, 2004, 2008, 2014, 2022
  • పాకిస్తాన్(2): 2000, 2012