Asia Cup 2023: పాక్ గడ్డపై ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ

Asia Cup 2023: పాక్ గడ్డపై ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ

క్రికెట్‌ మహాసమరాల్లో ఒకటైన ఆసియా కప్ 2023 పోరు బుధవారం(ఆగస్ట్ 30) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈసారి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండగా.. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరిగే నేపాల్‌ vs పాకిస్థాన్ మ్యాచ్‌తో టోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానుంది.

ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకలను దాయాది పాకిస్తాన్.. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓపెనింగ్ సెర్మనీ జరుగు ముల్తాన్ క్రికెట్ స్టేడియం బాణాసంచా వెలుగులతో మెరిసిపోనున్నట్లు సమాచారం. భారత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌తో పాటు ప్రముఖ సింగర్ ఆతిఫ్ అస్లమ్ ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫార్మ్ చేయనున్నారు. అంతేకాదు సాంప్రదాయ ఏషియన్ మ్యూజిక్, డ్యాన్స్ ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి.

ఆసియా కప్ 2023 ప్రారంభ వేడుకలు.. మనదేశంలో స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే, డిజిటల్‌గా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండనుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం(ఆగష్టు 30) మధ్యాహ్నం 3 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ ప్రారంభమవుతుంది.