పాక్ టార్గెట్ 182

పాక్ టార్గెట్ 182

పాక్ తో జరుగుతున్న ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు శుభారంభం చేసినా టాప్ ఆర్డర్ విఫలమైంది. మూడో బ్యాట్స్ మెన్ గా క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. వికెట్లు పోతున్నా... సింగిల్స్ తీస్తూ పాక్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అడపాదడపా బౌండరీలు బాదుతున్నాడు. ఈ క్రమంలో.. 36 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 181 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మలు ధాటిగా ఆడారు. స్కోరు బోర్డును పరుగెత్తించడంతో అభిమానులు ఖుష్ అయిపోయారు.

జట్టు స్కోరును హాఫ్ సెంచరీ దాటించిన ఓపెనర్లను కట్టడి చేయడానికి పాక్ బౌలర్లు శ్రమించారు. ఎట్టకేలకు వారి శ్రమ ఫలించింది. జట్టు స్కోరు 54 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్ శర్మ (28) పెవిలియన్ కు చేరాడు. జాగ్రత్తగా ఆడుతున్న రాహుల్ కు కోహ్లీ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి పరుగులు రాబట్టేందుకు కృషి చేశారు. కానీ.. మరో 8 పరుగులు జోడించిన అనంతరం రాహుల్ (28) కూడా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13), రిషబ్ పంత్ (14), పాండ్యా (0)  పెద్దగా ఆడకుండానే ఔట్ కావడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం కోహ్లీ 53, హూడా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో షాదాబ్‌‌ ఖాన్ రెండు, మహ్మద్ హసన్‌, హరీష్ రవూఫ్‌‌, మహ్మద్ నవాజ్‌‌ లు చెరో వికెట్ తీశారు.