బంగ్లా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాక్.. ఒట్టిచేతులతో స్వదేశానికి పయనం

బంగ్లా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాక్.. ఒట్టిచేతులతో స్వదేశానికి పయనం

ఆసియా క్రీడల క్రికెట్ విభాగంలో బంగ్లాదేశ్ మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. సోమవారం డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ మహిళా జట్టుతో జరిగిన కాంస్య పతక పోరులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి గౌరవప్రదంగా టోర్నీని ముగించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ మహిళా జట్టు.. బంగ్లా బౌలర్ల ధాటికి 64 పరుగులకే కుప్పకూలింది. ముగ్గురు డకౌట్ కాగా, 17 పరుగులు చేసిన అలియా రియాజ్ టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో మారుఫా అక్తర్ 3 ఓవర్లలో కేవలం రెండు పరుగులిచ్చి వికెట్ తీసుకోవడం  గమనార్హం. అనంతరం 65 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా బ్యాటర్లు మరో 10 బంతులు మిగిలివుండగానే చేధించారు. ఈ విజయంతో పాకిస్తాన్ ఒట్టిచేతులతో ఇంటికి పయనమవ్వగా.. బంగ్లాదేశ్‌ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.