Asian Games 20233: బంగ్లాపై ఘన విజయం.. ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా

Asian Games 20233: బంగ్లాపై ఘన విజయం.. ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా

ఆసియా క్రికెట్ క్రీడల్లో భారత పురుషుల జట్టు ఫైనల్ లో అడుగు పెట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో.. టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బౌలర్లు రాణించడంతో బంగ్లాదేశ్ 96 పరుగులకే కుప్పకూలగా.. లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు వీర విహారం చేశారు.

మొదట భారత బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 96 పరుగులకే పరిమితమైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో బంగ్లా బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా అవస్థలు పడ్డారు. ఏ ఒక్క బంగ్లా బ్యాటర్ 30 పరుగులు కూడా చేయలేకపోవడంతో.. బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. భారత బౌలర్లలో సాయి కిషోర్ 3 వికెట్లు తీసుకోగా.. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 97 పరుగుల లక్ష్యాన్ని భారత్.. ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. జైశ్వాల్ డకౌట్ గా వెనుదిరగగా.. వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ వీర విహారం చేశాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు,  6 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు.

ఈ విజయంతో భారత జట్టు.. ఆసియా క్రికెట్ క్రీడల్లో పథకం ఖరారు చేసుకోగా స్వర్ణం అందుకోవాలంటే మరో విజయం సాధించాలి.