ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ విజేతలు  సిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ విజేతలు  సిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ :  ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్ మెడలిస్ట్  షూటర్ సిఫ్ట్ కౌర్ తొలి ఒలింపిక్ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజేతగా నిలిచింది. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నలుగురు ప్రత్యర్థులను ఓడిస్తూ నీరజ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1,2వ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచాడు. బుధవారం జరిగిన ఫైనల్లో సిఫ్ట్ 466.3 స్కోరుతో టాప్ ప్లేస్ సాధించగా.. అషి చౌక్సీ 462.6 స్కోరుతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.

ఒలింపియన్ అంజుమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మౌద్గిల్ 449.2 స్కోరుతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకుంది. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ 462.2 స్కోరుతో టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విజేతగా నిలవగా, ఇప్పటికే పారిస్ బెర్తు దక్కించుకున్న స్వప్నిల్ కుశాలే (460.9), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (450.5) రెండు, మూడో స్థానాలు సాధించారు.