Asian Games 2023: జైస్వాల్ విధ్వంసం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా

Asian Games 2023: జైస్వాల్ విధ్వంసం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా

చైనా, హాంగ్జౌ వేదికగా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో భారత పురుషుల జ‌ట్టు సెమీఫైన‌ల్‪కు దూసుకెళ్లింది. మంగళవారం నేపాల్‌తో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో.. టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు నిర్ధేశించిన 2023 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్  బ్యాటర్లు ఆఖరి ఓవర్ వరకూ పోరాడారు.   

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 202 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(25) త్వరగా పెవిలియన్ చేరినా.. మరో ఎండ్ నుంచి య‌శ‌స్వి జైస్వాల్ వీరవిహారం చేశాడు. 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో శతకం(100) బాదాడు. చివరలో రింకూ సింగ్(37; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా మెరుపులు మెరిపించడంతో టీమిండియా 200 దాటింది. 

ALSO READ: Asian Games 2023: ధోనీని చూసి చాలా నేర్చుకున్నా.. కానీ అతన్ని ఫాలో అవ్వను: గైక్వాడ్

అనంతరం 203 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్ జ‌ట్టు.. 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పయి కష్టాల్లో ఉన్న నేపాల్ జట్టును.. దీపేంద్ర సింగ్ ఐరీ, సందీజ్ జోరా ఆదుకున్నారు. కాసేపు వరుస సిక్స్ లు బాధి భారత బౌలర్లను భయపెట్టారు. అయితే కీలకమైన సమయంలో వీరిని పెవిలియన్ చేర్చిన ఇండియా.. చివరికి 23 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. భార‌త బౌల‌ర్లలో ర‌వి బిష్ణోయ్‌, అవేశ్ ఖాన్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.