ఏషియన్ పెయింట్స్ లాభంలో భారీ తగ్గుదల .. క్యూ4లో 45 శాతం డౌన్‌‌‌‌‌‌‌‌

ఏషియన్ పెయింట్స్ లాభంలో భారీ తగ్గుదల .. క్యూ4లో 45 శాతం డౌన్‌‌‌‌‌‌‌‌
  • రెవెన్యూ రూ.8,358.91 కోట్లు
  • పెయింట్స్‌‌‌‌‌‌‌‌కు తగ్గిన డిమాండ్‌‌‌‌‌‌‌‌, పెరిగిన పోటీ
  • షేరుకి రూ.20.55 ఫైనల్ డివిడెండ్‌‌‌‌‌‌‌‌ 

న్యూఢిల్లీ: ఏషియన్ పెయింట్స్ నికర లాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ4) లో  ఏడాది లెక్కన 45 శాతం పడిపోయింది. గతేడాది జనవరి–-మార్చి కాలంలో రూ.1,275.30 కోట్ల నికర లాభం సాధించిన కంపెనీ, ఈ ఏడాది క్యూ4 లో   రూ.700.83 కోట్లు పొందింది. పెయింట్స్‌‌‌‌‌‌‌‌కు  డిమాండ్ తక్కువగా ఉండటం, పోటీ తీవ్రత పెరగడంతో లాభం తగ్గిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో వివరించింది. కార్యకలాపాల నుంచి వచ్చిన రెవెన్యూ 4.25 శాతం తగ్గి రూ.8,730.76 కోట్ల నుంచి   రూ.8,358.91 కోట్లకు చేరింది.  "డిమాండ్ తక్కువగా ఉండటం, కన్స్యూమర్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, పోటీ తీవ్రత పెరగడం వల్ల రెవెన్యూ తగ్గింది" అని ఏషియన్ పెయింట్స్  పేర్కొంది. 

మొత్తం ఖర్చులు క్యూ4లో  రూ.7,276.60 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం (రెవెన్యూ, ఇతర ఆదాయాలు కలిపి) ఏడాది లెక్కన 5.14 శాతం తగ్గి  రూ.8,458.76 కోట్లకు చేరింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్   మాట్లాడుతూ, గత కొన్ని క్వార్టర్లుగా డిమాండ్ బలహీనంగా ఉందని, క్యూ4లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయని చెప్పారు. "డెకరేటివ్ కోటింగ్స్ డిమాండ్ మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే క్యూ4లో కొంత మెరుగ్గా ఉంది. దేశీయ డెకరేటివ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లో సేల్స్ 1.8 శాతం పెరిగాయి.  కానీ స్టాండఎలోన్ రెవెన్యూ మాత్రం 5 శాతం తగ్గింది. ఆపరేటింగ్ మార్జిన్స్ గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి" అని ఆయన వివరించారు. మిగిలిన బిజినెస్‌‌‌‌‌‌‌‌లతో పోలిస్తే  ఇండస్ట్రియల్ బిజినెస్  మెరుగ్గా పనిచేసింది. జనరల్ ఇండస్ట్రియల్, ఆటోమోటివ్ కోటింగ్స్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో 6.1 శాతం గ్రోత్ సాధించామని అమిత్ అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ డల్‌‌‌‌‌‌‌‌

అంతర్జాతీయ మార్కెట్లలో, ఇథియోపియా, ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌లో కరెన్సీ విలువ తగ్గడం, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో మాక్రో-ఎకనామిక్ సవాళ్ల వల్ల క్యూ4లో  ఏషియన్ పెయింట్స్ సేల్స్ ఏడాది లెక్కన 1.5 శాతం తగ్గి రూ.799.7 కోట్లకు చేరాయి. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఈ మార్కెట్ల నుంచి  రూ.812.3 కోట్ల రెవెన్యూ వచ్చింది.  "మొత్తం మాక్రోఎకనామిక్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్ అనిశ్చితంగా ఉన్నప్పటికీ, డిమాండ్ పరిస్థితులు రికవరీ అవుతాయని ఆశిస్తున్నాం. బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను మరింత బలపరిచి,  సమర్ధతను పెంచుతాం" అని అమిత్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.  ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, ఏషియన్ పెయింట్స్ నికర లాభం  ఏడాది లెక్కన 33.25 శాతం తగ్గి రూ.3,709.71 కోట్లకు పడింది. 

2023–24లో కంపెనీ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌  రూ.5,557.69 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ  4.7 శాతం తగ్గి రూ.34,478.23 కోట్లకు చేరింది. కాగా, ఏషియన్ పెయింట్స్ తన సబ్సిడరీలతో కలిపి 14 దేశాల్లో బిజినెస్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది.  26 పెయింట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను  నిర్వహిస్తోంది.  ఏషియన్ పెయింట్స్, ఆప్కో కోటింగ్స్, ఏషియన్ పెయింట్స్ బెర్జర్, ఏషియన్ పెయింట్స్ కాస్‌‌‌‌‌‌‌‌వే, స్కిబ్‌‌‌‌‌‌‌‌ పెయింట్స్, టాబ్‌‌‌‌‌‌‌‌మాన్స్, కడిస్కో ఏషియన్ పెయింట్స్ వంటి బ్రాండ్లను ఆపరేట్ చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరం కోసం షేర్‌‌‌‌‌‌‌‌కు రూ.20.55 ఫైనల్ డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు  సిఫారసు చేసింది. ఏషియన్ పెయింట్స్ షేర్లు గురువారం 1.29 శాతం నష్టపోయి  రూ.2,302.50 వద్ద ముగిశాయి.