
కరీంనగర్ జిల్లాలో యువకుని సూసైడ్ కలకలం రేపింది. యాపీగ సత్తాన్న నేను.. యెవ్వలు బాధపడొద్దు.. మంచిగ జెపుతాన్న.. హ్యాపీగ వోతాన్న నేను.. అంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలచి వేస్తోంది. సెల్ఫీ తీసుకుని మరీ సూసైడ్ కు పాల్పడ్డాడు యువకుడు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బూడిదిపల్లికి చెందిన రాహుల్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను తనవాళ్లు తిట్టారన్న కోపంతో చనిపోవడం లేదని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. తను ఎన్నో రోజులుగా చనిపోవాలని అనుకుంటున్నానని.. అది ఇప్పుడు కుదిరిందని పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
►ALSO READ | వామ్మో.. పెన్ గంగ బ్రిడ్జిపై నుంచి దూకుతోంది.. నదులు రోడ్లపైకి వచ్చినయ్..
పురుగుల మందును నీళ్లు తాగినట్లుగా గుట్టగుట్ట తాగేసి పడేశాడు రాహుల్. రాహుల్ సెల్ఫీ సూసైడ్ వీడియో వైరల్ గా మారింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు పోలీసులు. ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోఆరా తీస్తున్నారు.