ఇండోర్స్ లో రూ.రెండు వేల కోట్లతో.. ఏషియన్ పెయింట్స్ ప్లాంటు

 ఇండోర్స్ లో రూ.రెండు వేల కోట్లతో.. ఏషియన్ పెయింట్స్ ప్లాంటు

 

  • ఎంపీ నగరం ఇండోర్​లో నిర్మాణం
  • ఏటా కొత్తగా 10 స్టోర్లను తెరుస్తాం
  • ఏషియన్ పెయింట్స్ సీఈఓ అమిత్​

హైదరాబాద్​, వెలుగు: కంపెనీ కెపాసిటీ విస్తరణలో భాగంగా  మధ్యప్రదేశ్​నగరం ఇండోర్​లో మరో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని ఏషియన్ పెయింట్స్ సీఈఓ అమిత్ సింగ్లే వెల్లడించారు. హైదరాబాద్​లో మంగళవారం అమిగో క్లాసిక్​​ హోమ్​ స్టూడియోను ప్రారంభించిన సందర్భంగా ‘వెలుగు’తో మాట్లాడారు.  ‘‘ఈ ప్లాంటు సామర్థ్యం నాలుగు లక్షల కిలోలీటర్ల వరకు ఉంటుంది. సుమారు రూ. 2,000 కోట్లు పెట్టుబడి అవసరమని అంచనా. 

మూడేళ్లలోపు ఇక్కడ ప్రొడక్షన్​ మొదలవుతుంది. మాకు హైదరాబాద్​సమీపంలోనూ ప్లాంటు ఉంది. కొత్తగా ప్రారంభించిన పెద్ద స్టోర్లకు పెట్టుబడి దాని స్థలం ఆధారంగా మారుతుంది.  రూ. మూడు కోట్లు నుంచి రూ. ఆరు కోట్ల వరకు ఉండవచ్చు. ఈ సంవత్సరం  ఇప్పటికే ఐదు స్టోర్లు తెరిచాం. ఏటా 5 నుంచి 10 స్టోర్లను దేశవ్యాప్తంగా తెరుస్తాం. కస్టమర్లు పర్యావరణ అనుకూల, బ్యాక్టీరియా తొలగించే పెయింట్స్​ను కోరుకుంటున్నాం. 

అందుకే మేం  ఏరోప్లేన్ పెయింట్​ను అందుబాటులోకి తెచ్చాం. ఇది గాలిలోని సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్​ను గ్రహించి శుభ్రపరుస్తుంది. నీలయా ఆర్క్ అనేది పర్యావరణ అనుకూల ఉత్పత్తి. ఆర్కిటెక్టులు, డిజైనర్లు దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈసారి వర్షాల కారణంగా డిమాండ్​ కాస్త తక్కువ ఉంది. వచ్చే 3-–6 నెలల్లో పండుగ డిమాండ్ పెరగవచ్చు.  

ఏషియన్ పెయింట్స్ సుమారు 40 నుంచి 50 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. యూఎస్​లోని ఒక కంపెనీతో జాయింట్ వెంచర్ కూడా ఉంది”అని ఆయన వివరించారు.