ఆసియా షూటింగ్ లో అభినవ్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌ మెడల్

ఆసియా షూటింగ్ లో  అభినవ్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌ మెడల్

షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా షూటర్ల గురి అదిరింది. గురువారం అందుబాటులో ఉన్న ఐదు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌లో నాలుగు గెలిచారు. 10 మీటర్ల జూనియర్‌‌‌‌ మెన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ ఫైనల్లో అభినవ్‌‌‌‌ 250.4 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచి స్వర్ణం సాధించాడు. టీమ్‌‌‌‌ విభాగంలో అభినవ్‌‌‌‌–నరేన్‌‌‌‌ ప్రణవ్‌‌‌‌–హిమాన్షు త్రయం 1890 పాయింట్లతో ఆసియాతో పాటు జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ రికార్డు కూడా నెలకొల్పారు. 

విమెన్స్‌‌‌‌ జూనియర్‌‌‌‌ స్కీట్‌‌‌‌ ఫైనల్లో మాన్సి రఘువంశీ 53 పాయింట్లతో గోల్డ్‌‌‌‌  గెలవగా, యశస్వి రాథోర్‌‌‌‌ 52 పాయింట్లతో  సిల్వర్‌‌‌‌ను సొంతం చేసుకుంది. కజకిస్తాన్‌‌‌‌ షూటర్‌‌‌‌ లిడియా బషరోవా (40)కు బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ దక్కింది. ఇండియాకే చెందిన అగ్రిమా కన్వర్‌‌‌‌ (15) ఆరో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకుంది. మెన్స్‌‌‌‌ జూనియర్‌‌‌‌ స్కీట్‌‌‌‌ ఫైనల్లో హర్మెహర్ సింగ్ లల్లీ (53), జ్యోతిరాదిత్య సింగ్‌‌‌‌ సిసోడియా (43) వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను గెలిచారు.  టీమ్‌‌‌‌ విభాగంలో హర్మెహర్‌‌‌‌ సింగ్‌‌‌‌,  జ్యోతిరాదిత్య,  అతుల్‌‌‌‌ సింగ్‌‌‌‌ రజావత్‌‌‌‌ బృందం 338 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. సీనియర్‌‌‌‌ మెన్స్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ ఫైనల్లో రుద్రాంక్ష్‌‌‌‌ పాటిల్‌‌‌‌–అర్జున్‌‌‌‌ బబుటా–జాదవ్‌‌‌‌ కిరణ్‌‌‌‌ అంకుష్‌‌‌‌ 1892.5 పాయింట్లతో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను కైవసం చేసుకున్నారు.