అనంత్‌‌జీత్‌‌కు గోల్డ్‌‌.. సౌరభ్‌‌-సురుచికి కాంస్యం

అనంత్‌‌జీత్‌‌కు గోల్డ్‌‌.. సౌరభ్‌‌-సురుచికి కాంస్యం

షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియాకు గోల్డ్‌‌, బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ లభించాయి. బుధవారం జరిగిన మెన్స్‌‌ స్కీట్‌‌ ఫైనల్లో అనంత్‌‌జీత్‌‌ సింగ్‌‌ నరుకా 57–56తో మన్సూర్‌‌ అల్‌‌ రషీద్‌‌ (కువైట్‌‌)పై గెలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాంటినెంటల్‌‌ టోర్నీలో అనంత్‌‌జీత్‌‌కు ఇది ఐదో మెడల్‌‌ కావడం విశేషం.

10 మీటర్ల ఎయిర్‌‌ పిస్టల్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఈవెంట్‌‌లో సౌరభ్‌‌ చౌదరి–సురుచి ఇందర్‌‌ సింగ్‌‌ కాంస్యంతో మెరిశారు. కాంస్య పతక పోరులో సౌరభ్‌‌–సురుచి 17–8తో లియు హెంగ్‌‌ యు–సీహ్‌‌ సియాంగ్‌‌ చెన్‌‌ (చైనీస్‌‌తైపీ)పై గెలిచారు. జూనియర్‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌ పిస్టల్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఈవెంట్‌‌లో వన్షికా చౌదరి–గవిన్‌‌ అంథోనీ 16–14తో కిమ్‌‌ యెజిన్‌‌–కిమ్‌‌ డుయోన్‌‌ (కొరియా)పై గెలిచి బ్రాంజ్‌‌ మెడల్‌‌ను సొంతం చేసుకున్నారు. క్వాలిఫికేషన్‌‌ రౌండ్‌‌లో ఇండియా ద్వయం 578 పాయింట్లతో రెండో ప్లేస్‌‌లో నిలిచింది.