60 ఏళ్లలో తొలిసారి ఆసియా దేశాల గ్రోత్ ఢమాల్

60 ఏళ్లలో తొలిసారి ఆసియా దేశాల గ్రోత్ ఢమాల్

టోక్యో : కరోనా ఎఫెక్ట్‌ తో 60 ఏళ్లలో మొట్టమొదటిసారి ఆసియా దేశాల ఎకనమిక్ గ్రోత్ భారీగా పడిపోతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనావేసింది. ఈ రీజియన్‌లో సర్వీసెస్ సెక్టార్ పూర్తిగా దెబ్బతిందని ఐఎంఎఫ్ పేర్కొంది. ట్రావెల్ బ్యాన్, సోషల్ డిస్టాన్సింగ్ పాలసీలు, ఇతర చర్యలతో ప్రభావితమవుతోన్న హౌస్ హోల్డ్స్‌ ను, సంస్థలను ప్రభుత్వాలు, విధానకర్తలు ఆదుకోవాలని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ డిపార్ట్‌ మెంట్ డైరెక్టర్ ఛాంగ్‌యోంగ్ రీ చెప్పారు. గ్లోబల్ ఎకానమీకి ఇది ఛాలెంజింగ్ టైమ్ అని, ఆసియా, పసిఫిక్ రీజియన్ కూడా దీనికి మినహాయింపు కాదని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం ఈ రీజియన్‌పై ఎక్కువగా ఉందని లైవ్‌ వెబ్‌కాస్ట్ బ్రీఫింగ్‌లో తెలిపారు. ఎప్పటిలాగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఇది సమయం కాదన్నారు.

ఆసియా దేశాలన్ని ప్రభుత్వాల పాలసీ సూచనలను పాటించాలని పేర్కొన్నారు. 60 ఏళ్లలో మొట్టమొదటిసారి ఆసియా ఎకానమీ జీరో గ్రోత్‌తో బాధపడుతుందని పేర్కొన్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌పై ఐఎంఎఫ్‌ రిపోర్ట్ విడుదల చేసింది. గ్లోబల్ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్లు 4.7 శాతంగా ఉన్నాయని, ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. హౌస్‌ హోల్డ్స్ అందరూ ఇండ్లలోనే ఉంటుండటం, షాపులు షట్‌డౌన్ కావడంతో, ఈ రీజియన్ సర్వీసు సెక్టార్‌‌పై డైరెక్ట్‌  ప్రభావం పడిందని ఐఎంఎఫ్ వివరించింది.  ఈ రీజియన్‌లో ఉన్న ఎక్స్‌ పోర్ట్‌ దేశాలు కూడా డిమాండ్ పడిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పింది. అమెరికా, యూరోపియన్ దేశాలు ఎక్స్ పోర్ట్ దేశాలకు కీలక ట్రేడింగ్ పార్టనర్లుగా ఉండటమే దీనికి కారణమని తెలిపింది. చైనా ఎకానమీ ఈ ఏడాది 1.2 శాతం పెరిగే అవకాశం ఉంది. జనవరిలో ఈ దేశ గ్రోత్ అంచనాలు 6 శాతంగా ఉన్నాయి. ఎక్స్ పోర్ట్స్ పడిపోవడం, దేశీయ యాక్టివిటీ నష్టపోవడం చైనా ఎకానమీని దెబ్బకొట్టాయి. ఈ ఏడాది చివరిలో చైనా ఎకానమీ మళ్లీ పునరుద్ధరించుకుంటుందని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. కరోనా వైరస్‌ను చైనీస్ పాలసీ మేకర్లు చాలా స్ట్రాంగ్‌గా ఎదుర్కొన్నారని తెలిపింది. మార్కెట్లకు లిక్విడిటీ అందిస్తూ.. ఎమ్​ఎస్​ఎమ్​ఈల ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఐఎంఎఫ్ కోరింది.