ఆసిఫాబాద్ మండలంలో గాలివాన బీభత్సం

ఆసిఫాబాద్ మండలంలో గాలివాన బీభత్సం

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు బలంగా వీయడంతో బూర్గుడ గ్రామంలోని గాజుల పెంటయ్య, చిగురు గోపాల్, పుధరి పెంటక్క, బుజాడి బొడ్డు, దర్ని రమేశ్, ఎరువోతు వినోద్, పులగం శంకర్, దాడి రగులయ్య ఇంటి పైకప్పులు గాలికి ఎగిరిపోయి నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి.

విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంటి పైనున్న రాయి పడి పెంటక్క అనే వృద్ధురాలికి, చెట్టు కొమ్మ విరిగి పడి లోకొండే చిన్నక్కకు గాయాలయ్యాయి. ఈదురుగాలుల ధాటికి రహదారి పక్కనే నిలిపిన లారీ పక్కకు పడింది. ఓ దాబా హోటల్ రేకులు లేచిపోయి పొలాల్లో పడ్డాయి.